A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనవరికి గజ్వేల్ కు రైలు నడపాల్సిందే
Share |
February 21 2018, 3:30 am

అక్కంపేట-మెదక్,కొత్తపల్లి- మనోహరాబాద్ రైలు మార్గాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులను మంత్రి హరీశ్ రావు కోరారు.2019 కొత్త సంవత్సరంలొ దక్షిణ మధ్య రైల్వే జి.ఎం,సి.ఎం కేసీఆర్ తో కలిసి గజ్వెల్ కు రైలులో ప్రయాణించాలని ఆయన అన్నారు. అక్కంపేట-మెదక్ మధ్య 11 బాటిల్ నెక్ సమస్యలు న్నాయని, తక్షణమే వాటిని పరిష్కరించాలని హరీశ్ రావు కోరారు.రాష్ట్రంలో ఉన్న 460 రైల్వే లెవెల్ క్రాసింగులకు ఆర్వోబి ల నిర్మాణ పనులు చేపడుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్
కుమార్ యాదవ్ తెలిపారు. 460 ఆర్వోబీల నిర్మాణం దశల వారీగా చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. రైల్వే పెండింగ్ బ్రిడ్జి నిర్మాణాలపై ఇరిగేషన్  మంత్రి  హరీష్ రావు  అధ్యక్షతన జలసౌధ లో బుధవారం సమీక్ష సమావేశం  జరిగింది.  రహదారులు భవనములు శాఖ మంత్రి తుమ్మల, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి , ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ , రైల్వే జి. ఎం వినోద్ యాదవ్,  ఇతర  రాష్ట్ర ఉన్నాతాధికారులు
పాల్గొన్నారు. ఈ సంవత్సరం 52 ఆర్వోబీలు నిర్మాణానికి 2700కోట్లతో అంచనాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. 52 ఆర్వోబీల నిర్మాణానికి  రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు 50 : 50 నిష్పత్తిలో నిధులు ఖర్చు చేస్తామన్నారు. రోడ్ ఓవర్ బ్రిడ్జ, రోడ్ అండర్ బ్రిడ్జి లనిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్టు మంత్రి తుమ్మల తెలిపారు. రెండు విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఆయా  నిర్మాణాలు  పూర్తవుతాయని  మంత్రి తుమ్మల
తెలిపారు. రైల్వే లెవెల్ క్రాసింగుల వద్ద ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ అంతరాయాలు తగ్గించేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు. రు.

tags : hairsh, gajwel,rail

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info